Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

డిగ్రీ ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్లు

Author Eravelli Harshini | 23 Sep 2026, 11:09 AM | TELANGANA
డిగ్రీ ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్లు

డిగ్రీ ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్లు

మహాదేవపూర్, భారతవాసి: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహాదేవపూర్‌లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం డీఓఎస్‌టీ స్పాట్‌ అడ్మిషన్లు ఈ నెల 24, 25 తేదీల్లో, ప్రత్యేక స్పాట్‌ అడ్మిషన్లు 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా. జన్ను విజయ్‌కుమార్‌ తెలిపారు.

డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు కళాశాలకు స్వయంగా హాజరై ప్రవేశ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. అడ్మిషన్‌ సమయంలో అన్ని అసలు ధ్రువపత్రాలతో పాటు ఒక జిరాక్స్‌ ప్రతుల సెట్‌, అవసరమైన కళాశాల ప్రవేశ రుసుమును వెంట తీసుకురావాలని సూచించారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత విద్యను కొనసాగించాలని ప్రిన్సిపాల్‌ కోరారు.

ఇవి కూడా చదవండి