Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విజ్ఞాన విహార యాత్ర అపోలో కాలేజ్ ప్రిన్సిపాల్ వేముల గణేష్

Author Hanmanth nayak | 26 Sep 2026, 03:41 PM |
విజ్ఞాన విహార యాత్ర అపోలో కాలేజ్ ప్రిన్సిపాల్ వేముల గణేష్

హుస్నాబాద్ పట్టణం లోని శ్రీ అపోలో వృత్తి విద్యా జూనియర్ కళాశాల విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలో భాగంగా హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువును సందర్శించారు ఈ యాత్రలో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు మరియు తెలంగాణ రాష్ట్రం లోని మొట్టమొదటి గాజు వంతెన జరుగుతున్న పనులు ఎల్లమ్మ చెరువు అందాలను చూసి.. విద్యార్థులు చాల సంతోషపడ్డారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ గణేష్ వేముల మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం లోని మొట్టమొదటి గాజు వంతెన పనులు మరియు ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు పూర్తి ఐతే హుస్నాబాద్ టూరిజం లో తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి పర్యాటక కేంద్రం అవుతుంది అని అన్నారు ఈ కార్యక్రమములో బోధన సిబ్బంది సంధ్యా సమత స్వప్న అనూష నవ్య మరియు బోధనేతర సిబ్బంది శరత్ అరుణ విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు