Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఘటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి దిగ్భ్రాంతి ..

Author Meda raju | 28 Sep 2026, 02:01 PM | Array
ఘటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి దిగ్భ్రాంతి ..

మంచిర్యాల, సెప్టెంబర్ 28: మంచిర్యాల జిల్లా సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ–ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను మందమర్రి మండలానికి చెందిన మహిళలుగా గుర్తించారు.

ప్రమాద ఘటనపై శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పందించారు. ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం వ్యక్తిగతంగా అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు క్షతగాత్రులకు రూ.10 వేల చొప్పున వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు.

ఇవి కూడా చదవండి