Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పారాక్వాట్ డైక్లోరైడ్‌పై నిషేధం

Author BHARATHA VAASI | 29 Sep 2026, 11:03 AM | TELANGANA
పారాక్వాట్ డైక్లోరైడ్‌పై నిషేధం

మనుషులు, జంతువుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా భావిస్తున్న పారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు సంహారకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కొత్తగా రిజిస్ట్రేషన్లను తక్షణమే నిలిపివేయడంతో పాటు గతంలో జారీ చేసిన రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను కూడా రద్దు చేస్తూ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిపుణుల కమిటీ సిఫార్సులు, రిజిస్ట్రేషన్ కమిటీ సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. జులై 10న విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన అనంతరం తుది ఉత్తర్వులు వెలువడ్డాయి.