Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎలికేశ్వరంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ

Author Eravelli Harshini | 06 Oct 2026, 04:17 PM | TELANGANA
ఎలికేశ్వరంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ

ఎలికేశ్వరం: ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఎలికేశ్వరం గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు మేరుగు లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి లింగాల రామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధ్యక్షుడిగా ఆర్ల శ్యామ్ ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా బోడ సందీప్, ప్రధాన కార్యదర్శిగా పల్లె సునీల్, కార్యదర్శిగా గద్దె రఘు, కోశాధికారిగా సకినాల నీలయ్య ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులను నాయకులు శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో గ్రామ యువత, అంబేద్కర్‌వాదులు పాల్గొన్నారు.