Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వాహనాల వేలంతో రూ.5.11 లక్షల ఆదాయం

Author Eravelli Harshini | 09 Oct 2026, 10:19 AM | TELANGANA
వాహనాల వేలంతో రూ.5.11 లక్షల ఆదాయం

కాటారం, భారతవాసి: కాటారం ఆబ్కారీ కార్యాలయం పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలకు గురువారం బహిరంగ వేలం నిర్వహించారు. జిల్లా ఆబ్కారీ అధికారి పర్యవేక్షణలో కాటారం ఆబ్కారీ సీఐ కరుణశ్రీ ఆధ్వర్యంలో వేలం ప్రక్రియ నిర్వహించారు.
మొత్తం 40 వాహనాలకు వేలం నిర్వహించగా, ఇందులో 39 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో ఉన్నాయి. వీటికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర రూ.3,34,400గా ఉంది. బహిరంగ వేలంలో వాహనాలకు పోటీ నెలకొనడంతో రూ.5,11,530కు వేలం జరిగినట్లు అధికారులు తెలిపారు.పన్నుతో కలిపి మొత్తం రూ.5,11,530 ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర కంటే రూ.1,77,130 అధికంగా ఆదాయం లభించింది. వేలం ప్రక్రియను నిబంధనల మేరకు నిర్వహించినట్లు ఆబ్కారీ సీఐ కరుణశ్రీ తెలిపారు.