Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వేటగాళ్లను వన్యప్రాణుల సంరక్షకులుగా మారుస్తున్న అటవీశాఖ

Author syed Abzal pasha | 09 Oct 2026, 12:07 PM | TELANGANA
వేటగాళ్లను వన్యప్రాణుల సంరక్షకులుగా మారుస్తున్న అటవీశాఖ

ఏటూరునాగారం, భారతవాసి: అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఏటూరునాగారం అటవీ రేంజ్ అధికారి రెహమాన్ అన్నారు. ములుగు జిల్లాలో విస్తారమైన అటవీ ప్రాంతం ఉన్నందున వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.అటవీ భూముల ఆక్రమణలను గుర్తించి, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సుమారు 20,050 హెక్టార్ల అటవీ భూమిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, మరో 650 హెక్టార్లలో అటవీకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు.వేటగాళ్లకు అవగాహన కల్పించి, వేటకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకుంటూ వారిని వన్యప్రాణుల సంరక్షకులుగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గతంతో పోలిస్తే వేట పరికరాల వినియోగం తగ్గిందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి వనరులను పరిరక్షించడం, వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.అడవుల పరిరక్షణకు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా సమష్టిగా పనిచేయాలని రెహమాన్ పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో అటవీ సంరక్షణ కార్యక్రమాలను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.