Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

విద్యార్థులకు బతుకమ్మ పండుగపై అవగాహన

Author syed Abzal pasha | 09 Oct 2026, 12:09 PM | TELANGANA
విద్యార్థులకు బతుకమ్మ పండుగపై అవగాహన

ఏటూరునాగారం, భారతవాసి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చిన్ననాటి నుంచే విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో మండలంలోని మరికాల కొత్తూరు ఎంపీపీఎస్‌లో బతుకమ్మ పండుగపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు విజయ్‌ విద్యార్థులకు బతుకమ్మ పండుగ విశిష్టత, తెలంగాణ సంస్కృతిలో దాని ప్రాధాన్యాన్ని వివరించారు.
బతుకమ్మ పండుగను ఎన్ని రోజులు నిర్వహిస్తారు, ఒక్కో రోజు ప్రత్యేకత ఏమిటి, వివిధ రకాల పూలతో బతుకమ్మను ఎలా పేర్చాలి, దాని చుట్టూ పాటలు పాడుతూ ఎలా ఆడతారనే అంశాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ఉపాధ్యాయుడు విజయ్‌ వారితో కలిసి బతుకమ్మ ఆడి చూపించారు.విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా పండుగల విశిష్టతను భవిష్యత్‌ తరాలకు అందించవచ్చని ఉపాధ్యాయుడు విజయ్‌ తెలిపారు.