Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రైతులారా.. వరి పంట వేయకండి: సీఎం రేవంత్ రెడ్డి

Author Meda raju | 15 Oct 2026, 09:01 PM | TELANGANA
రైతులారా.. వరి పంట వేయకండి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఎల్ నినో నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు కీలక సూచన చేశారు.
డిసెంబర్ నుంచి ప్రారంభమయ్యే సీజన్ లో పంటలు వేయడం తగ్గించాలని, ముఖ్యంగా వరి పంట సాగు చేయొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని జలాశయాల్లో కేవలం 209 TMCల నీరు మాత్రమే ఉందని, దీనిని వచ్చే జులై వరకు వాడుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
రైతులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరిన సీఎం, రైతులకు ఉపాధి హామీ ద్వారా పూర్తిస్థాయిలో పనులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.