Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

భూపాలపల్లి డీఆర్‌డీఏలో ఏసీబీ తనిఖీలు

Author As | 22 Oct 2026, 06:17 PM | TELANGANA
భూపాలపల్లి డీఆర్‌డీఏలో ఏసీబీ తనిఖీలు

భూపాలపల్లి కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పీఎంకేఎస్వై 2.0 పనులకు సంబంధించి కాంట్రాక్టర్ల నుంచి ఫోన్‌పే, బ్యాంకు లావాదేవీల ద్వారా రూ.39.14 లక్షలు తీసుకున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో జిల్లా పీఓ సతీష్ రెడ్డి, రేగొండ టెక్నికల్ అసిస్టెంట్ రాజును అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి బాలకృష్ణపై కూడా విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. తనిఖీల్లో భాగంగా కార్యాలయంలోని పలు ఫైళ్లు, రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇతరుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ చేపట్టినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు.