Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రోడ్డుపై బొగ్గు టిప్పర్లను అడ్డుకున్న రైతులు

Author As | 25 Oct 2026, 12:57 PM | TELANGANA
రోడ్డుపై బొగ్గు టిప్పర్లను అడ్డుకున్న రైతులు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం తాడిచెర్ల ఓపెన్‌కాస్ట్‌ నుంచి బొగ్గు టిప్పర్ల రాకపోకలతో రోడ్డుపై భారీగా దుమ్ము లేస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దుమ్ము కారణంగా సమీపంలోని మిర్చి, వరి పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై దుమ్ము లేవకుండా ట్యాంకర్లతో నీటిని చల్లాలని డిమాండ్‌ చేస్తూ బొగ్గు టిప్పర్లను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు.