Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గ్యాస్ ఏజెన్సీ తరలింపు పై భగ్గుమన్న బీఆర్ఎస్

Author Eravelli Harshini | 12 Sep 2026, 02:12 PM | TELANGANA
గ్యాస్ ఏజెన్సీ తరలింపు పై భగ్గుమన్న బీఆర్ఎస్

మహాదేవపూర్: మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీని జిల్లా కేంద్రానికి తరలించే ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ శనివారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన, గ్రామీణ ప్రజలు గ్యాస్ కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నాయకులు పేర్కొన్నారు. మంథని నియోజకవర్గ ప్రజల సమస్యలు మంత్రికి పట్టవా? అని ప్రశ్నించారు. ఏజెన్సీ తరలింపుపై అధికార కాంగ్రెస్‌ నాయకుల మౌనం వెనుక ఆంతర్యమేంటో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

గ్యాస్ ఏజెన్సీ తరలింపునకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబే బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. మండలంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రధాన కార్యాలయాలు, సౌకర్యాలను దూరం చేసే చర్యలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఏజెన్సీని మండల కేంద్రంలోనే కొనసాగించకపోతే మరింత భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు ఏ ముఖంతో ఓట్లు అడగడానికి వస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు గీతాబాయి, పీఏసీఎస్‌ డైరెక్టర్ తోట సుధాకర్, మాజీ సర్పంచి శ్రీపతి బాపు, మాజీ ఎంపీటీసీ కుమార్, మాజీ మహిళా అధ్యక్షులు స్వప్న, అరుణ, ఎడపల్లి మాజీ సర్పంచి చేకూర్తి శ్రీనివాస్, సీనియర్ నాయకులు కలికోట దేవేందర్, పోత వెంకటస్వామి, మైనార్టీ నాయకులు సయ్యద్ సాజిద్, అన్వర్, ఇస్తియాక్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి