Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గ్యాస్ ఏజెన్సీ తరలింపును రాజకీయ కోణంలో చూడొద్దు

Author Eravelli Harshini | 13 Sep 2026, 07:28 PM | Politics
గ్యాస్ ఏజెన్సీ తరలింపును రాజకీయ కోణంలో చూడొద్దు

మహాదేవపూర్:
మహాదేవపూర్ మండలంలో కొనసాగుతున్న హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీని భూపాలపల్లి జిల్లా కేంద్రానికి తరలించే అంశంపై బీఆర్‌ఎస్‌ నాయకులు చేపట్టిన రాస్తారోకోపై కాంగ్రెస్‌ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గ్యాస్ ఏజెన్సీ తరలింపు విషయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును నిందించడం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న విమర్శలేనని పేర్కొన్నారు.

హిందుస్థాన్‌ పెట్రోలియం సంస్థ ద్వారా గిరిజన సహకార సంస్థకు గ్యాస్‌ డీలర్‌షిప్‌ మంజూరైందని, డీలర్‌షిప్‌ పరిధి మార్పు విషయంలో సంబంధిత సంస్థల నిర్ణయమే కీలకమని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. హెచ్‌పీ సంస్థ, జీసీసీ మధ్య పరిపాలనా లేదా ఇతర కారణాలతో ఏమైనా నిర్ణయం జరిగిందా అనే విషయం తమకు తెలియదని, ముందుగా దీనిపై సంబంధిత సంస్థల నుంచి స్పష్టత తీసుకోవాలని సూచించారు.

గ్యాస్‌ ఏజెన్సీ తరలింపును శ్రీధర్‌బాబుకు ఆపాదించడం సమంజసం కాదని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏజెన్సీని మహాదేవపూర్‌లోనే కొనసాగించేలా హెచ్‌పీ, జీసీసీ అధికారులను కోరడం ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలని అన్నారు. సమస్యను రాజకీయ అంశంగా మార్చి వ్యక్తిగత విమర్శలకు దిగడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

శ్రీధర్‌బాబు పేరును పదేపదే ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శలు చేయడం మానుకుని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్‌ వర్గాలు సూచించాయి. సంబంధిత సంస్థల నిర్ణయాలు, డీలర్‌షిప్‌ నిబంధనలు, తరలింపు కారణాలపై స్పష్టత వచ్చిన తర్వాతే రాజకీయ విమర్శలు చేయాలని హితవు పలికారు.

ప్రజలకు అందుబాటులో ఉండేలా గ్యాస్‌ ఏజెన్సీని మహాదేవపూర్‌లోనే కొనసాగించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు