Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కల్వచర్లలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ

Author Sanjeev Panuganti | 14 Sep 2026, 10:27 AM |
కల్వచర్లలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ

•_మట్టి విగ్రహాలు పర్యావరణ పరిరక్షణలో సర్వప్రాణి హితం- సింగరేణి జియంలు సుంకర మధుసూదన్, కొలిపాక నాగేశ్వరరావు_
పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో శ్రీ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని, భజన మండలి కన్వీనర్, విశ్రాంత సింగరేణి అధికారి నూక రమేష్ గారి ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలోని సాయి నిలయం వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ గారి వద్ద కొనుగోలు చేసిన మట్టి విగ్రహాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు _"మట్టి వినాయకుని పూజిద్దాం... పర్యావరణాన్ని కాపాడుదాం"_ అనే సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం సింగరేణి ఆర్జీ3 మరియు ఆడ్రియాల జనరల్ మేనేజర్లు సుంకర మధుసూదన్, కొలిపాక నాగేశ్వరరావు, కల్వచర్ల ఆలయ కమిటీ చైర్మన్ రేండ్ల కుమారస్వామి గార్ల చేతుల మీదుగా జరిగింది. పర్యావరణ పరిరక్షణలో మీ వంతు పాత్ర అభినందనీయం, సర్వప్రాణి హితమని అంటూ నిర్వాహకులు నూక రమేష్ గారిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సెక్యూరిటీ అధికారి అబ్దుల్ షబ్బీరుద్దీన్, సింగరేణి మాజీ ఏరియా సర్వే అధికారి కోలేటి రమేష్, భజన మండలి సభ్యులు రామిడి వెంకటేశ్వర్లు, కొలిపాక సారయ్య, గరిగంటి రాజం, కొండ సమ్మయ్య, గుండా శంకరయ్య, కొత్త కమలాకర్, గంట మధుసూదన్ రెడ్డి, వేముల కుమారస్వామి, కాట మల్లయ్య, వొడితెల శ్రీనివాస్, నామని శ్రీనివాస్, కన్నూరి లక్ష్మి, సంపత్, నాంసాని సందీప్, పుల్లూరి అన్వేష్, శ్రీమనోహర్, సాయి స్కంద మరియు గ్రామ ప్రజలు పాల్గొని వినాయక చవితి పండుగ శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు.