Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రోటరీ క్లబ్ వారి మట్టి వినాయక విగ్రహాల పంపిణీ*

Author Pulluri srinivas | 14 Sep 2026, 12:11 PM | TELANGANA
రోటరీ క్లబ్ వారి మట్టి వినాయక విగ్రహాల పంపిణీ*

*
పకృతి అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి
అధ్యక్షులు : బొద్దిరెడ్డి నరసింహారెడ్డి.
స్థానిక నర్సంపేట పట్టణం యందు ఎమ్మెల్యే క్యాంపు ప్రహరి గోడ ప్రాంగణం ముందు ఈరోజు 14 సెప్టెంబర్ 2026 సోమవారం రోజున మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా రోటరీ క్లబ్ నర్సంపేట బాధ్యుల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణి చేయడం జరిగింది.
ఇది కార్యక్రమంలో అధ్యక్షులు బొద్దిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ కాలుష్యాన్ని వివరిస్తూ పకృతి పర్యావరణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు తమ కర్తవ్యం గా భావించి మట్టి గణపతులను పూజిద్దాం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు కృత్రిమ రంగులు వాడి తయారు చేసిన విగ్రహాల వల్ల జలం మరియు పర్యావరణ కాలుష్యం ఏర్పడి భూమిపై జీవజాతులు అంతరించిపోతున్నాయి కావున మనమందరం బాధ్యతగా మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణలో పకృతి అభివృద్ధిలో భాగస్వాములవుదాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ సెక్రెటరీ సిద్ధ సుధాకర్ కొంతం నరేందర్ గుడిపూడి పవన్ కుమార్ దోమ కుంట్ల ప్రకాష్ వంగ సాంబయ్య అయ్యప్ప స్వామి దేవాలయం నిత్య అర్చకులు దేవిష్ మిశ్రా దేశి రాము శింగిరికొండ కిషోర్ విశ్వబంధు కన్నయ్య మట్టి విగ్రహాల లబ్ధిదారులు భక్తులు మహిళలు పురుషులు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.