Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అవగాహన లోపమా.. అతి ఉత్సాహమా..?

Author Eravelli Harshini | 14 Sep 2026, 04:33 PM | TELANGANA
అవగాహన లోపమా.. అతి ఉత్సాహమా..?

మహాదేవపూర్:
కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలలోనే అసలు వాస్తవాలు దాగి ఉన్నాయని బీఆర్‌ఎస్‌ నాయకుడు బుర్రి రవి ఒక ప్రకటనలో విమర్శించారు.గతంలో రూ.1,030కే లభించే గ్యాస్‌ సిలిండర్‌ ఇప్పుడు ఏకంగా రూ.1,100 పెట్టి కొనాల్సిన దుస్థితి ఎవరి వల్ల ఏర్పడిందో కాంగ్రెస్‌ నాయకులు వివరించాలని డిమాండ్‌ చేశారు.కొన్ని ప్రజా సంఘాల ద్వారానే గ్యాస్‌ ఏజెన్సీ తరలిపోయినట్టు స్వయంగా కాంగ్రెస్‌ నాయకులే ఒప్పుకోవడం, దానిని సమర్థిస్తూ ప్రకటనలు ఇవ్వడం కాంగ్రెస్‌ నాయకులకే సాధ్యమని ఎద్దేవా చేశారు.ప్రజలను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు? ప్రజలకు ఎవరు భారం మోపుతున్నారో, ఆ ప్రజా సంఘాలను అడ్డం పెట్టుకొని ఎవరు గ్యాస్‌ ఏజెన్సీని తరలించే కుట్రలు చేస్తున్నారో ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.రూ.1,100 పెట్టి కొనుగోలు చేస్తే అది అధిక ధర కాదా? అది కాంగ్రెస్‌ నాయకుల కళ్లకు కనపడడం లేదా? అని ప్రశ్నించారు.టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై లేనిపోని బురదజల్లే ప్రయత్నం చేయడం తప్ప ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు.ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్‌ నాయకులు వెంటనే మండల కేంద్రానికి గ్యాస్‌ ఏజెన్సీని తీసుకురావాలని, అధిక ధరకు విక్రయిస్తున్న వారిపై చర్యలు చేపట్టడం పోయి ఇతరులపై బురదజల్లడం మానుకోవాలని హెచ్చరించారు.
కాంగ్రెస్‌ పార్టీ కమిషన్ల కోసమే గ్యాస్‌ ఏజెన్సీ తరలింపు జరిగిందని దీనిని చూస్తే అర్థం కావడం లేదా? మీ ప్రకటనలోనే అర్థం దాగి ఉందని, అది ప్రజలకు అర్థమయిపోయిందని అన్నారు. ఇక్కడ ఏజెన్సీ ఉన్నప్పుడు రూ.1,030కు లభించే గ్యాస్‌, భూపాలపల్లికి తరలిన తర్వాత రూ.1,100 కావడం ఏంటని ప్రశ్నించారు. మీ కమిషన్ల కోసమే ఏజెన్సీని తరలించినట్టు స్పష్టంగా ప్రజలకు అర్థమయిపోయిందని హితవు పలికారు.