Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎన్‌ఎస్‌యూఐ బలోపేతానికి కృషి చేయాలి

Author Eravelli Harshini | 16 Sep 2026, 05:51 PM |
ఎన్‌ఎస్‌యూఐ బలోపేతానికి కృషి చేయాలి

శ్రీధర్‌బాబు మార్గదర్శకత్వంలో పనిచేస్తూ భూపాలపల్లి జిల్లాలో ఎన్‌ఎస్‌యూఐను మరింత బలోపేతం చేసి, విద్యార్థుల హక్కుల సాధనకు కృషి చేస్తానని భూపాలపల్లి జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు పురుషోత్తం అనూప్ తెలిపారుజయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా నియమితులైన పురుషోత్తం అనూప్ బుధవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తనను జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా నియమించినందుకు ఆయన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌యూఐతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ప్రోత్సహిస్తూ జిల్లా, మండల స్థాయిల్లో విద్యార్థి విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.
జిల్లాలోని ప్రతి కళాశాలలో ఎన్‌ఎస్‌యూఐ సంస్థను విస్తరించి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించినట్లు అనూప్ తెలిపారు..