Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మానవ హక్కులపై అవగాహన సదస్సు

Author BHARATHA VAASI | 20 Sep 2026, 08:48 PM | TELANGANA
మానవ హక్కులపై అవగాహన సదస్సు

హన్మకొండ: హన్మకొండలో జాతీయ మానవ హక్కుల మండలి (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఎన్‌జీవో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాసేవ, సంస్థ భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలను కొనసాగించేందుకు ‘డెమొక్రటిక్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్’ నూతన సంస్థాగత వేదికను లాంఛనంగా ప్రారంభించారు.ఎన్‌జీవో గ్రూప్ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల సాధారణ బీమా సౌకర్యం కల్పించనున్నట్లు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఐలినేని శ్రీనివాస్ తెలిపారు. అనుభవజ్ఞులైన పాత సభ్యుల సేవానుభవాన్ని, కొత్త సభ్యుల శక్తి, సేవాభావాన్ని సమన్వయం చేయాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో న్యాయవాదులు, వైద్యులు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, యువతతోపాటు సామాజిక సేవలో అనుభవం ఉన్నవారిని సంస్థలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన మార్గాల్లో న్యాయ సహాయం అందించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని తీర్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ నక్క గంగారం, ఉత్తర తెలంగాణ బాధ్యులు కోరిపెల్లి ప్రశాంత్ రావు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు భూక్య సురేష్, భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కుమార్, కార్యవర్గ సభ్యులు సుంకే మధు, వెన్నంపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నా