Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

లెంకలగడ్డలో ఘనంగా కుంకుమ పూజ

Author Eravelli Harshini | 21 Sep 2026, 02:28 PM | TELANGANA
లెంకలగడ్డలో ఘనంగా కుంకుమ పూజ

లెంకలగడ్డ: శ్రీ వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామ క్షేమం కోసం ఆదివారం కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. పురోహితులు ముప్పిడోజు రాజేశ్వరాచార్యుల ఆధ్వర్యంలో లలితా అష్టోత్తర పూజ, అష్టలక్ష్మి అష్టోత్తర పూజతో పాటు కుంకుమార్చన నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమానికి గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. పూజా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ గ్రామస్తులు, మహిళా మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

లెంకలగడ్డలో ఘనంగా కుంకుమ పూజ - Additional Image