Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

హిందూ ధర్మంపై ఇంత నిర్లక్ష్యమా

Author Hanmanth nayak | 21 Sep 2026, 06:54 PM | Array
హిందూ ధర్మంపై ఇంత నిర్లక్ష్యమా

హిందూ పండుగల పట్ల కాంగ్రెస్‌ నిర్లక్ష్యం: బీజేపీ ధ్వజం


కరీంనగర్ సాక్ష్యం ప్రతినిధి సెప్టెంబర్ 21

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గణేశ్ నిమజ్జనానికి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. నీటి విడుదల కోసం బీజేపీ ఆధ్వర్యంలో 'చలో చింతకుంట' పేరిట చేపట్టిన భారీ ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం, ఎస్సారెస్పీ ద్వారా కాలువకు నీటిని విడుదల చేసిందని పేర్కొన్నారు. ఇది బీజేపీ పోరాటానికి, హిందూ సమాజానికి లభించిన విజయమని స్పష్టం చేశారు.ఇతర మతాల పండుగలకు అడిగినంత నిధులిచ్చే ప్రభుత్వం, హిందూ పండుగల నిమజ్జనానికి నీళ్లు ఇవ్వడానికి కూడా వెనకాడటం కాంగ్రెస్ పక్షపాత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. నీటి విడుదలపై కరీంనగర్‌కు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు చేస్తున్న వ్యాఖ్యలు అజ్ఞానానికి పరాకాష్ఠ అని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ఎన్నం ప్రకాష్, వెంకటేష్, ఓబీసీ మోర్చా నాయకుడు ఆడిచర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి