Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

చేతకాని వాడు మీసాలు మెలేసినట్టు... కరెంటు ఇవ్వలేక, నిలదీస్తే అరెస్టులా?

Author Eravelli Harshini | 24 Sep 2026, 12:06 PM | TELANGANA
చేతకాని వాడు మీసాలు మెలేసినట్టు... కరెంటు ఇవ్వలేక, నిలదీస్తే అరెస్టులా?

మహాదేవపూర్ : కరెంటు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, ప్రశ్నించే గొంతును నొక్కుతోందని, ఇది ప్రజాస్వామ్య గొంతు నొక్కే చర్యేనని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పవర్ ప్లాంట్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా, మహాదేవపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.రైతులకు 24 గంటల నిరంతర నాణ్యమైన కరెంటు ఇవ్వలేని ఈ ప్రభుత్వం, రైతులను అరిగోస పెడుతోందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో నిరంతర విద్యుత్ తో రైతు మొహంలో ఆనందం ఉండేదని, మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు ఈ కరెంటు కోతలు ఏంటని ప్రశ్నించారు.సరిపడేంతా విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ప్లాంట్లు ఉన్నా, బొగ్గు నిల్వలు సరిపోవడం లేదంటూ కుంటి సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ పంటలకు సరిపడా నీరు ఉన్నా, కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలు మీకు అధికారమిచ్చింది రైతులను ఇబ్బంది పెట్టడానికేనా? అని నిలదీస్తూ, కాంగ్రెస్ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతులకు నిరంతరంగా విద్యుత్ అందేలా చూడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
ముందస్తు అరెస్టు అయిన వారిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీపతిబాపు, కేదారి గీత, అలీం ఖాన్, కూరతోట శ్రీహరి, చిల్ల కుమార్, వెన్నంపల్లి మహేష్, రెవెల్లి రాజశేఖర్, ఇస్తియాక్, కడారీ రమేష్ తదితరులు ఉన్నారు