Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పూలు,ఆకుకూరల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు*

Author malyala karunakar | 30 Sep 2026, 04:35 PM | TELANGANA
పూలు,ఆకుకూరల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు*

*పూలు,ఆకుకూరల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు*

గుడిహత్నూర్ భారత వాసి :ఈరోజు గుడిహత్నూర్ మండలంలోని తోషం మరియు మాన్కాపూర్ గ్రామాల్లో పూలు, కూరగాయలు మరియు ఆకుకూరల సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని *ఉద్యాన శాఖ విస్తరణ అధికారి ఆడెపు శేఖర్* తెలిపారు.

పూలు,ఆకుకూరల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు*  - Additional Image

ఈ సందర్భంగా ఎలినీవో ప్రభావం దృష్ట్యా రైతులు పంటల వైవిధ్యాన్ని పాటిస్తూ పూల తోటలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, కొత్తిమీర, మెంతి వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. స్థానిక మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చని తెలిపారు.

ఇవి కూడా చదవండి

కూరగాయల పంటలు, బంతి పూల తోటలను సందర్శించి, రైతులకు పంటల సాగు, యాజమాన్య పద్ధతులు, పురుగు–తెగుళ్ల నివారణ మరియు అధిక దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు అందించినట్లు *ఉద్యాన శాఖ విస్తరణ అధికారి ఆడెపు శేఖర్* తెలిపారు.
ఆయన వెంట రైతులు ఉపసర్పంచ్ సుశీల్, బడే ప్రహ్లాద్ తదితరులు పాల్గొన్నారు.