Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఆదిలాబాద్ విమానాశ్రయానికి కుంరం భీం నామకరణం: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా కమిటీ కృతజ్ఞతలు

Author malyala karunakar | 03 Oct 2026, 12:56 PM | TELANGANA
ఆదిలాబాద్ విమానాశ్రయానికి కుంరం భీం నామకరణం: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా కమిటీ కృతజ్ఞతలు

ఆదిలాబాద్ విమానాశ్రయానికి కుంరం భీం నామకరణం: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా కమిటీ కృతజ్ఞతలు*

గుడిహత్నూర్ భారత వాసి:

ఆదివాసీల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చుతూ ఆదిలాబాద్ ప్రతిపాదిత విమానాశ్రయానికి మహా వీరుడు, జల్-జంగల్-జమీన్ పోరాట స్ఫూర్తి ప్రదాత *కుమ్రం భీం* పేరును ఖరారు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు *రాయిసిడం జంగు పటేల్* ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి కుమ్రం భీం పేరు పెట్టాలని ఆదివాసీ సమాజం గత ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమిస్తోందని, నేడు రాష్ట్ర ప్రభుత్వం మా గోసను విని చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ఆదివాసీ సమాజం ఎన్నటికీ మరువలేని ఘట్టమని ఆయన అన్నారు.

ఆదివాసీల ఆత్మగౌరవానికి ప్రతీక, స్వయం పాలన కోసం నిజాం సర్కారుపైనే తిరుగుబాటు చేసిన మహా యోధుడు కుమ్రం భీం పేరు ఆదిలాబాద్ విమానాశ్రయానికి పెట్టడం ద్వారా ఆదివాసీల చరిత్రకు, త్యాగానికి నిజమైన గుర్తింపు లభించిందని అన్నారు.

ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి, జిల్లా నాయకత్వానికి* ఆదివాసీ సేన ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ఆమోదించి అధికారికంగా కుమ్రం భీం పేరును ఖరారు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి కుంరం చత్రుఘన్ తదితరులు పాల్గొన్నారు