Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

బిజెపి రాష్ట్ర ఎస్టీ మోర్చా కార్యవర్గ సభ్యురాలు విజయ దేవి

Author Hanmanth nayak | 04 Oct 2026, 05:30 PM |
బిజెపి రాష్ట్ర ఎస్టీ మోర్చా కార్యవర్గ సభ్యురాలు విజయ దేవి

- బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా గుగులోతు విజయ దేవి.

కరీంనగర్ భారత వాసి అక్టోబర్ 04

భారతీయ జనతా పార్టీ ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా గుగులోతు విజయ దేవి నియామకమయ్యారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా నియామకమైన సందర్భంగా ఆమె బిజెపి సీనియర్ నాయకత్వానికి మరియు పార్టీ శ్రేణులకు ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా విజయదేవి మాట్లాడుతూ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా తన నియమకానికి పూర్తిస్థాయిలో సహకరించిన, ఆశీస్సులు అందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బిజెపి రాష్ట్ర అధ్యక్షులుఎన్.రామచంద్ర రావు కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తనను గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా నియమించిన బిజెపి పార్టీ ఎస్టీ మోర్చా అధ్యక్షులు నేనావత్ రవి నాయక్, కరీంనగర్ జిల్లా బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులుసాయిని మల్లేష్ కు జిల్లా బిజెపి నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను క్రమశిక్షణకు లోబడి గిరిజన సోదర సోదరీమణుల సమస్యల పరిష్కారం కోసం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం, భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలు నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతానని ఆమె వెల్లడించారు.

ఇవి కూడా చదవండి