Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

అనారోగ్యంతో మృతిచెందిన కుటుంబానికి ఎమ్మార్పీఎస్ ఆర్థిక సాయం

Author Eravelli Harshini | 09 Oct 2026, 10:25 AM | TELANGANA
అనారోగ్యంతో మృతిచెందిన కుటుంబానికి ఎమ్మార్పీఎస్ ఆర్థిక సాయం

మహాదేవపూర్, భారతవాసి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన సకినారపు లచ్చక్క అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ మహాదేవపూర్ మండల ఇన్‌చార్జి జిల్లెల్ల నాగరాజు మాదిగ గురువారం ఆమె దశదినకర్మకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఐదు లీటర్ల వంట నూనె అందజేసి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సూరారం గ్రామ శాఖ అధ్యక్షుడు అయిల్ల అశోక్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ సీనియర్ నాయకుడు తుడిచెర్ల దుర్గయ్య, మాజీ సర్పంచ్ కొయ్యల మల్లయ్య, పుల్యాల మల్లయ్య, తోడిచెర్ల విజయ్, ఎనగందుల సుందర్, తోడిచెర్ల సుమన్, దేవేందర్, శేఖర్, చెన్నూరి రాజబాబు, సంజీవ్, రంజిత్, పుల్యాల శేఖర్, మందపల్లి వెంకట్, ఆత్కూరి దుర్గయ్య, జిల్లెల్ల సారయ్య, మీసాల రామయ్య, కొయ్యల మధుకర్, చెన్నూరి మధుకర్ తదితర గ్రామస్థులు పాల్గొన్నారు.