Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇసుక లారీ బీభత్సం.. సీఆర్పీఎఫ్ జవాన్ దుర్మరణం

Author syed Abzal pasha | 09 Oct 2026, 12:04 PM | TELANGANA
ఇసుక లారీ బీభత్సం.. సీఆర్పీఎఫ్ జవాన్ దుర్మరణం

ఏటూరునాగారం, భారతవాసి: ములుగు జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడ్వాయి–పసర మండలాల మధ్య అటవీ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఇసుక లారీ ఎదురుగా వస్తున్న పోలీసు వాహనం, ప్రైవేటు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ మొగురమ్ రమాకాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లు గిరీష్ కుమార్, ప్రేమ్ ప్రకాష్, రంజానమ్ ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు.ఏటూరునాగారం నుంచి ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు పోలీసు వాహనంలో ములుగు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇసుక లారీ ఢీకొట్టడంతో పోలీసు వాహనం అదుపుతప్పి అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. మరోవైపు ప్రైవేటు కారు లారీ కిందకు వెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న పి.రమేష్, సయ్యద్ సఫియాకు గాయాలయ్యాయి. వీరు తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల ఎంపీడీవో కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నట్లు తెలిసింది.సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.