Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

Author Eravelli Harshini | 15 Oct 2026, 04:43 PM | TELANGANA
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని గంగారం తండా, గట్లకుంట తండాల్లో గురువారం ఎక్సైజ్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. వరంగల్ డిప్యూటీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టారు.
దాడుల్లో భాగంగా నాలుగు కేసులు నమోదు చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడంతో పాటు, గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన 650 లీటర్ల పులియబెట్టిన పానకాన్ని ధ్వంసం చేశారు. జిల్లాలో గుడుంబా తయారీ, విక్రయాల నియంత్రణకు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో వరంగల్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ భారతి, ఆమె బృందం, జిల్లా టాస్క్‌ఫోర్స్ సీఐ రాకేష్, ఆయన బృందం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ ఎస్సై సాయికుమార్ బృందం, భూపాలపల్లి ఎక్సైజ్ బృందం, కాటారం ఎక్సైజ్ సీఐ కరుణశ్రీ, ఎస్సై సందీప్ కుమార్, వారి బృందం పాల్గొన్నారు.