Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇంద్రవెల్లి కుంరం భీం కాంస్య విగ్రహ ఆవిష్కరణ - ఉమ్రి( బి) రాయి సెంటర్ లో గోడపత్రాల ఆవిష్కరణ

Author BHARATHA VAASI | 19 Oct 2026, 06:56 PM | TELANGANA
ఇంద్రవెల్లి కుంరం భీం కాంస్య విగ్రహ ఆవిష్కరణ - ఉమ్రి( బి) రాయి సెంటర్ లో గోడపత్రాల ఆవిష్కరణ

గుడిహత్నూర్ భారత వాసి: ఇంద్రవెల్లి సార్ మేడి మరియు నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రాలను ఉమ్రి-బి రాయి సెంటర్ కార్యాలయంలో ఘనంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఉమ్రి రాయి సెంటర్ సార్ మేడి గారికి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఇంద్రవెల్లి కుంరం భీం కాంస్య విగ్రహ ఆవిష్కరణ - ఉమ్రి( బి) రాయి సెంటర్ లో గోడపత్రాల ఆవిష్కరణ - Additional Image

ఈ కార్యక్రమంలో కేస్లాపూర్ సార్ మేడి మేస్రం వేంకట్ రావు, రాజ్ గోండ్ ఉద్యోగుల సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మేస్రం శేఖర్ బాబు గిన్నెర సార్ మేడి మేస్రం దుర్గు, గిన్నెర ఉప మేడి కుంరం లక్ష్మణ్, సాలేగూడ సర్పంచ్ కోవా రాజేశ్వర్, రాజ్ గోండ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోడం మోతిరాం, ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్, టీఆర్ఎస్ జడ్పీటీసీ అభ్యర్థి ఉర్వేత రోహిత్, రాయి సెంటర్ సార్ మేడి కాత్లె భరత్, మాజీ సార్ మేడి పేందోర్ మారుతి రావు, ఉప సార్ మేడి మేస్రం జంగు, స్థానిక సర్పంచ్ ఆర్క భరత్ కుమార్, మాజీ సర్పంచ్ సోయం బోజ్జు, గిత్తెధార్ ఆర్క నాగోరావు, మాజీ ఎంపీటీసీ పేందోర్ జైరాం, కుంరం అచ్చంత్ రావు పటేల్, మేస్రం అర్జున్ పటేల్ మరియు రాయి సెంటర్ పరిధిలోని వివిధ గ్రామాల పటేళ్లు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి