Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వరి పంటను పరిశీనించిన డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి.

Author Galipelli raju | 24 Oct 2026, 09:11 PM | జగిత్యాల
వరి పంటను పరిశీనించిన డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి.

కొడిమ్యాల మండలంలో కత్తెర పురుగు ప్రభావంతో వరి పంట రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటకు పురుగు సోకడంతో దిగుబడి తగ్గింది.విషయం తెలుసుకున్న వన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి శనివారం రోజున పంట నష్టపోయిన పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు. అనంతరం రైతులతో కలిసి వ్యవసాయ విస్తరణాధికారిని పి.జ్యోతికి వినతిపత్రం సమర్పించారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు. ఇట్టి సందర్భంగా డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి మాట్లాడుతూ
కత్తెర పురుగు ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి,ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పురుగు నివారణకు అవసరమైన సమాచారాన్ని అందించి రైతులకు అండగా నిలవాలని కోరారు.
బాధిత రైతులు మాట్లాడుతూ
కత్తెర పురుగు దాడితో వరి పంటకు నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నామని తెలిపారు. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి, ప్రభుత్వం పరిహారం అందించి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.వ్యవసాయ విస్తరణాధికారిని పి.జ్యోతి మాట్లాడుతూ కొడిమ్యాల మండలంలో కత్తెర పురుగుతో పాటు కంకినల్లి, సుడిదోమ ఉధృతిని కూడా గమనించినట్లు ఏఈఓ పి.జ్యోతి తెలిపారు. కత్తెర పురుగు రాత్రివేళల్లో చురుగ్గా ఉంటూ వరి కంకులను కోస్తుందని, పగటిపూట మొక్కల మొదళ్ల వద్ద దాక్కుంటుందని వివరించారు.రైతులు ఉదయం,సాయంత్రం పొలాలను పరిశీలిస్తూ పురుగు లక్షణాలను గుర్తించాలని సూచించారు. ఏ మందులు వాడాలనే విషయంలో వ్యవసాయ అధికారులను సంప్రదించి నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.