Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కుంరం భీం స్ఫూర్తితో రాజ్యాంగపరమైన హక్కుల సాధనకు ఉద్యమిస్తాం - ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి

Author BHARATHA VAASI | 26 Oct 2026, 06:06 PM | TELANGANA
కుంరం భీం స్ఫూర్తితో రాజ్యాంగపరమైన హక్కుల సాధనకు ఉద్యమిస్తాం - ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి

కుంరం భీం స్ఫూర్తితో రాజ్యాంగపరమైన హక్కుల సాధనకు ఉద్యమిస్తాం - ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి

గుడిహత్నూర్ భారత వాసి:, విప్లవ వీరుడు కుంరం భీం స్ఫూర్తితో ఆదివాసీల రాజ్యాంగపరమైన హక్కుల సాధనకు నిరంతరం ఉద్యమిస్తామని ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి అన్నారు.

కుంరం భీం స్ఫూర్తితో రాజ్యాంగపరమైన హక్కుల సాధనకు ఉద్యమిస్తాం - ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి - Additional Image

అమరవీరుడు కుంరం భీం 86వ వర్ధంతి సందర్భంగా సోమవారం గుడిహత్నూర్ మండలంలో ఘనంగా నివాళులర్పించారు. గోండ్వానా రాయి సెంటర్ ఆధ్వర్యంలో మండలంలోని మాన్కాపూర్ రాయి సెంటర్ నుండి గుడిహత్నూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం డోలు, పెప్రే, సన్నాయి వాయిస్తూ ఆదివాసీ యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గుడిహత్నూర్ ఆర్టీసీ బస్సు స్టాండ్ సమీపంలోని కుంరం భీం వద్ద 86వ వర్ధంతి సందర్భంగా వర్ధంతి జెండా ఆవిష్కరించి , పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోవ దౌలత్ రావు మొకాశి మాట్లాడుతూ.. "మా ఊళ్లో మా రాజ్యం" అని నినదించిన కుంరం భీం ఆశయాలను కొనసాగిస్తామన్నారు. బాబే ఝరి కేంద్రంగా 12 గ్రామాలతో స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించిన ఆయన తెగువ నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. జల్, జంగల్, జమీన్ కోసం, 1/70 చట్టం, పెసా చట్టం అమలు కోసం రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కుంరం వంశీయులు కుంరం రాందాస్,కుంరం రఘు గోండ్వానా రాయి సెంటర్ మన్కపూర్ సార్మేడి పేందోర్ జైరాం, ఉప మేడి ఆత్రం భీం రావ్, ఉమ్రి బి రాయి సెంటర్ ఉప సార్మేడి మేస్రం జంగు, మాజీ సార్మేడి పేందోర్ మారుతి రావు, మన్కపూర్ సర్పంచ్ కోవ భగవాన్, ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్, ఆదివాసి సేన రాష్ట్ర నాయకులు పేందోర్ విశ్వనాథ్, ఆదివాసి విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు మర్సకోల నగేష్, సీనియర్ ఆదివాసి నాయకులు ఉయిక లక్ష్మణ్ , ఆదివాసి సేన జిల్లా కార్యదర్శి కుంరం చత్రుఘన్, ఆదివాసి సేన గుడిహత్నూర్ మండల నాయకులు నైతం గణేష్, ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు మేస్రం మోహన్, ఆదివాసి రైతు సేన రాష్ట్ర నాయకులు తోడషం భూమ పటేల్, ఆదివాసి విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు కోట్నక గణేష్, ఆదివాసి సర్పంచ్లు ఉర్వేత బాపురావు, మడవి ముకుంద్, టిఆర్ఎస్ నాయకులు రోహిత్, జగ్ జీవన్, తోడషం దౌలత్ రావు మరియు మండలంలోని ఆదివాసి గ్రామాల పటేళ్లు తదితరులు పాల్గొన్నారు.